కందుకూరులో తమ్ముళ్ళ ఫ్లెక్సీల రగడ.. వైరి వర్గాల మధ్య ముదిరిన వివాదం..
సింగరాయకొండ ప్లై ఓవర్ దగ్గర తెలుగు తమ్ముళ్ళ ఫ్లేక్సీలు కట్టే క్రమంలో ఇరు వర్గాల ఓవరాక్షన్ వివాదానికి దారితీసింది. ఒకే పార్టీకి చెందిన వాళ్ళు రెండు వర్గాలుగా చీలి ఒకరి పై ఒకరు దాడికి యత్నం చేశారు. తేల్చుకుందా మంటే తేల్చుకుందాం అంటూ కేకలు వేసిన వైరి గ్రూపులు, కాగా గొడవ జరుగుతుందన్న సమాచారంతో అక్కడకు వెళ్ళి వీడియో చిత్రీకరిస్తున్న జర్నలిస్టుల మీద దాడి చేశారు.
పోలీసులు ను సైతం లెక్క చేయకుండా, వారి పై కూడా తిరగబడి దాడికి ప్రయత్నం చేశారు , అయితే దీని ప్రభావం చంద్రబాబు పర్యటనమీద కూడా ఉంటుందని భావిస్తున్నారు. గొడవలని నియంత్రించడంలో విఫలమైన పోలీస్, మున్సిపల్, ప్రకాశం, నెల్లూరు జిల్లాల అధికార యంత్రాంగం..